Top 10 Smart Phones of 2016 Top 10 - Bollywood Top 10 - Tollywood Top 10 Indian Cricketers of 2016 Surgical strike on Black money Best Birthday wishes to Magician of Words (Trivikram) Simple changes for healthy life!! Just submit 4 doc’s and get Passport!!

Indian Navy Job Notification

12-Dec-2016 02:01:41
Job Type Department Start Date End Date
Govt Navy 2016-12-12 2017-02-12

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్ధులకు శుభవార్త. 10+2 కంప్లీట్ చేసిన అభ్యర్ధులను సెయిలర్ పోస్టులకు ఆహ్వానమిస్తుంది. ఎస్‌.ఎస్‌.ఆర్ కోర్సు ద్వారా నేవల్ ట్రెయినింగ్ కేంద్రాల్లో అవకాశం కలిపించనుంది. శిక్షణ పూర్తయిన తర్వాత మాస్టర్ చీఫ్ పెట్టీ ఆఫీసర్ హోదాలో మంచి జీతాలు, చాలెంజింగ్ కెరీర్ ఉన్న ఉద్యోగంలోచేరనిస్తారు.

భారత ప్రభుత్వ రక్షణశాఖ పరిధిలోని ఇండియన్ నేవీ (ఐఎన్) సెయిలర్ పోస్టుల భర్తీకి సీనియర్ సెకండరీ రిక్రూట్స్ (ఎస్‌.ఎస్‌.ఆర్) - 2/2017 బ్యాచ్‌ లో చేరడానికి అర్హత గల అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఇండియన్ నావెల్ అకాడమీ విడుదలచేసింది.

వివరాలు: భారత రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని నావికాదళంలో సెయిలర్ పోస్టులు. ఆగస్టు 2017లో కోర్సు ప్రారంభమవుతుంది.

విద్యార్హతలు: గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఇంటర్ లేదా 10+2 లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. ఇంటర్ స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్‌తోపాటు కెమిస్ట్రీ/బయాలజీ లేదా కంప్యూటర్ సైన్స్‌ల్లో ఏదో ఒక సబ్జెక్టు కలిగి ఉండాలి.

వయస్సు: 1996 ఆగస్టు1 నుంచి 2000 జూలై 31 మధ్య జన్మించి ఉండాలి.

పే అండ్ అలవెన్స్‌ లు

-శిక్షణా కాలంలో నెలకు రూ. 5,700/- స్టయిఫండ్ ఇస్తారు.

-శిక్షణ పూర్తయిన తర్వాత రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 2,000/- + డీఏ ఇస్తారు.

పదోన్నతులు: సెయిలర్ నుంచి మాస్టర్ చీఫ్ పెట్టీ ఆఫీసర్ - 1 (సుబేదార్‌కు సమాన స్థాయి) వరకు ఉంటుంది.

-ఈ స్థాయిలో పే స్కేల్ రూ. 9,300- 34,800 + గ్రేడ్ పే రూ. 4800/- అదనంగా ఎంఎస్‌పీ రూ. 2000 + డీఏ ఇస్తారు.

-శిక్షణాకాలంలో సెయిలర్స్‌ కు పుస్తకాలు, యూనిఫాం, భోజనం, వసతి సౌకర్యాలను ఉచితంగా ఇస్తారు. సెయిలర్స్, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తారు. సెయిలర్స్ పిల్లల విద్య, హెచ్‌.ఆర్‌.ఏ అలవెన్స్‌ లు ఇస్తారు. వీటితోపాటు సంవత్సరాంత సెలవులు ఉంటాయి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌ నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామ్స్ ద్వారా చేస్తారు.

రాతపరీక్ష

-ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.

-పరీక్షలో ఇంగ్లిష్, సైన్స్, మ్యాథ్స్, జనరల్ నాలెడ్జ్‌పై ప్రశ్నలు ఇస్తారు

-ప్రశ్నపత్రం ఇంటర్ స్థాయిలో ఉంటుంది.

-పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు

-అభ్యర్థులు ప్రతి సెక్షన్‌లో తప్పనిసరిగా క్వాలిఫై కావాలి.

-రాతపరీక్ష మార్చి/ఏప్రిల్ 2017లో నిర్వహిస్తారు

ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ)

-7 నిమిషాల్లో 1.6 కి.మీ దూరాన్ని పరుగెత్తాలి

-20 ఉతక్, బైతక్ (గుంజీలు), 10 పుష్ అప్స్

నోట్: క్రీడల్లో, స్విమ్మింగ్, ఎక్స్‌ట్రా కరికులర్ యాక్టివిటీస్‌లో నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు.

శారీరక ప్రమాణాలు

-కనీసం 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగిన బరువు, ఛాతీ ఉండాలి. గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచించాలి.

-వీటితోపాటు నేవీ నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. మంచి కంటి చూపు ఉండాలి.

శిక్షణ

-శిక్షణ 2017 ఆగస్టులో ప్రారంభమవుతుంది. 22 వారాల పాటు బేసిక్ ట్రెయినింగ్‌ను ఐఎన్‌ఎస్ చిల్కాలో ఇస్తారు. దీనితోపాటు ప్రొఫెషనల్ ట్రెయినింగ్‌ను నేవల్ ట్రెయినింగ్ కేంద్రాల్లో ఇస్తారు.

-శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి 15 ఏండ్ల కాలపరిమితికి నియామక ఉత్తర్వులు ఇస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో డిసెంబర్ 5 నుంచి

చివరితేదీ: డిసెంబర్ 19

-ఆన్‌లైన్‌లో దాఖలు చేసిన కాపీ ప్రింట్‌ను తీసి వాటికి తగు సర్టిఫికెట్స్, ఫొటోలు, సెల్ఫ్ అడ్రస్‌డ్ ఎన్వలప్ కవర్‌ను జతచేసి సంబంధిత కార్యాలయానికి పంపాలి.

-తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు,

పుదుచ్చేరికి చెందిన అభ్యర్థులు కింది చిరునామాకు డిసెంబర్ 26 లోగా చేరుకొనేలా పంపాలి.

పోస్ట్ బాక్స్ నంబర్ - 488 గోలే డాక్ ఖానా, జీపీవో,న్యూఢిల్లీ - 110001

వెబ్‌ సైట్: WWW.JOININDIANNAVY.GOV.IN                       

Latest Videos

Job Notifications