“వీరమాచినేని” వారి డైట్.

09-Feb-2018 01:55:46
“వీరమాచినేని” వారి డైట్.

మానవ జీవితంలో బిపి,డయాబెటిస్, ఒబెసిటీ సర్వసాధారణమైపోయాయి.ఇవి తగ్గించుకోవడానికి మనం చేయని ప్రయత్నం లేదు.ఎంత ఖర్చుకైనా వెనకాడడంలేదు.

ఐతే మందులతో పని లేకుండ డయాబెటిస్, ఎలాంటి శస్త్ర చికిత్సతో పని లేకుండ,డైట్ తగ్గించే పని లేకుండ ఒబెసిటీని తగ్గించవచ్చంటున్నారు వీరమాచినేని రామకృష్ణ గారు.ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఈయన చెప్పిన డైట్ ను కొన్ని లక్షల మంది ఫాలో అవుతున్నారు.చాలా మంది బరువు తగ్గుతున్నారు.షుగరు పేషంట్లు మందులతో పని లేకుండా షుగరు తగ్గించుకోగలగుతున్నారు.డాక్టర్లు ఈ విధానం మంచిది కాదని,భవిష్యత్తులో కొన్ని సమస్యలు తలెత్తుతాయని కొంత మంది...అటువంటిది ఏమీ ఉండదు ఇది టెంపరరీ డైటే కాబట్టి అనుసరించడంలో తప్పేమీలేదని కొంత మంది అంటున్నారు.వీరమాచినేని మాత్రం డాక్టర్లను సంప్రదించే ఈ డైట్ ప్రారంభించమని చెబుతున్నారు.

ఈ డైట్ లో 4 పిల్లర్స్ ఉంటాయి అవేంటంటే

1 . ఫాట్ ( FAT ) తప్పక తీసుకోవాలి                  70 - 100 గ్రామ్స్  ప్రతిరోజు
2 . నిమ్మకాయలు ( NIMBU )                          3    ప్రతిరోజు
3 . మంచినీరు ( WATER )                              4 లీటర్లు
4 . మల్టీవిటమిన్ టాబ్లెట్                                   1  డైలీ      

ఫాట్ (ఫాట్ ఆయిల్స్ ) అంటే ఏంటో చెబుతాను చూడండి. ( రిఫండ్ ఆయిల్ అసలు వాడకూడదు )
1 . కొబ్బరినూనె 2 . నెయ్యి  3 . ఆలివ్ ఆయిల్ ( Fry లో వాడరాదు ) 4 . పెరుగు మీద వెన్నె  ( BUTTER ) 5 . చీజ్  -- వీటిలో ఏదైనా సరే ప్రతిరోజు  70 నుంచి 100 గ్రామ్స్ తీసుకోవాలి.

గళ్ళు ఉప్పు మాత్రమే వాడాలి అంటే సముద్రపు ఉప్పు (ఇయోడైజ్డ్ ఉప్పు వాడకూడదు.)

ప్రతిరోజు అవసరాన్ని బట్టి ఎనర్జీ (శక్తి ) కోసం తీసుకోవలసిన పదార్థాలు    
 
1 . బాదం                   10 అంతకన్నా తక్కువ   ప్రతిరోజు
2 . పిస్తా                     10 అంతకన్నా తక్కువ   ప్రతిరోజు
3 . వాల్ నట్   ( acrot )                            15 అంతకన్నా తక్కువ   ప్రతిరోజు
4 . గుమ్మడి గింజలు                                    1  నుంచి 6 spoons  డైలీ  
5 . పొద్దుతిరుగుడు గింజలు                          1  నుంచి 6 spoons  డైలీ
6 . పుచ్చ పప్పు గింజలు                  1  నుంచి 6 spoons  డైలీ
7 . తెల్ల నువ్వులు                    5  నుంచి 6 spoons  డైలీ
8 . అవిసె గింజలు                     fry  with ghee

ఈ కోర్సులో ఉన్నప్పుడు తీసుకోకూడని ఆహారం. ( ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకూడదు )
1 . బంగాళాదుంప  
2 . చామదుంప
3 . కంద గడ్డ                                    
4 . పెండలం                                                  
5 . చిలకడ దుంప                        
6 . బీట్ రూట్                  
7 . అరటి ( కూర చేసే అరటి కాయలు )              
8 . బీన్స్                                                                                 
9 . చిక్కుడు             
10 . బఠాణి                  
11 . కొబ్బరి నీరు
12 . పాలు
13 . పెరుగు                   
14 . తేనె  
15 . కూల్ డ్రింక్స్
16 . పంచ దార               
17 . స్వీట్స్  
18 . పచ్చి కొబ్బెర

ఈ కోర్సులో ఉన్నప్పుడు తీసుకోవలసిన ఆహారం.
మాంసాహారమైతే ( NON - VEG )  
 
1 . కోడిగుడ్లు ( పాచి సొనతో )                  1 నుంచి 6 అంతకన్నా తక్కువ   ప్రతిరోజు
2 .ఉడకబెట్టి/ఆమ్లెట్/ పొరటు                     1 నుంచి 6 అంతకన్నా తక్కువ   ప్రతిరోజు
3 . చికెన్    ( Chicken )                            మగా=300 గ్రామ్స్  ఆడ=200 గ్రామ్స్  ఉప్పు, కారం, మసాలా పట్టించి, ఫ్రిజ్ లో 2 గంటల పాటు ఉంచి తర్వాత వండుకోవాలి. మసాలా పౌడర్ ఇంట్లోనే తాయారు చేసుకోవాలి.                                      
4 . మటన్ ( Mutton )                                   
5 . చేపలు                         
6 . రొయ్యలు                   
7 . చికెన్ తండూరి                    మగా=300 గ్రామ్స్  ఆడ=200 గ్రామ్స్  ఫుడ్ కలర్ లేకుండా వండుకోవాలి
8 . చికెన్ కబాబ్                                                                                    
9 . చికెన్ టిక్కా                    
10 . గ్రిల్ల్డ్  చికెన్                      
11 . మటన్ బోన్స్ సూప్   

మరి శాఖాహారమైతే తీసుకోవాల్సిన ఆహరం

1 . టమాటా                  చిన్నవి అయితే 2 , పెద్దది అయితే 1  ప్రతిరోజు
2 .ఉల్లి                  చిన్నవి అయితే 2 , పెద్దది అయితే 1  ప్రతిరోజు
3 . క్యారెట్                  1                                     
4 . కీరా                      1                                  
5 . మిగతా అన్ని కూరగాయలు మరియు ఆకుకూరలు    అవసరమైతే తగినంత పాలతో లేదా ఫ్రై చేసుకోవచ్చు                        
6 . మునగాకు సూప్ చాలా మంచిది   1                   
7 . ఎండు కొబ్బరి      1/2 చిప్ప               
8 . బులెట్ ప్రూఫ్ కాఫీ                                                                                  
9 . టీ / కాఫీ       పాలు, పంచదార లేకుండా            
10 .లెమన్ టీ / గ్రీన్ టీ                      
11 . బిస్లరీ వాటర్
12 . మజ్జిగ ( బట్టర్ మిల్క్ )    2 చెంచాల పెరుగుతో లీటర్ వాటర్ తో                                                                     

                   
కామర్స్ చేసి వృతి రీత్యా బిజినెస్ లో స్థిరపడ్డ రామకృష్ణగారు తన బరువును తగ్గించుకునే ప్రయత్నంలో రకరకాల పద్ధతులను ప్రయత్నించి విసిగి అనేక రకాల పద్దతులను స్టడీ చేసి చివరకు ఒక డైట్ ప్లాన్ రెడీ చేసుకుని ఆ డైట్ ను పాటించి 120 కిలోల బరువు నుండి 90 కిలోల బరువుకు తగ్గారు. అంతేకాకుండా తన స్నేహితులతో ఈ డైట్ ప్లాన్ చేయించి వారికున్న ఒబెసిటీ,డయాబెటిస్ లను తగ్గించగలిగారు.

If You Like This Article, Please Share

రిలెటెడ్

1

లెటెస్ట్ వీడియోస్

హైలెట్స్